'ధమ్కీ' 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Sat, Mar 25, 2023, 08:58 PM

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన యాక్షన్ కామెడీ డ్రామా 'ధమ్కీ' మార్చి 22, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటుడు స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 6.86 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ పాన్-ఇండియన్ చిత్రంలో నివేదా పేతురాజ్ విశ్వక్సేన్ కి జోడిగా నటిస్తుంది. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీత అందిస్తున్నారు.


'ధమ్కీ' కలెక్షన్స్ :::::
నైజాం : 2.05 కోట్లు
సీడెడ్ : 73 L
UA : 64 L
ఈస్ట్ : 42 L
వెస్ట్ : 26 L
గుంటూరు : 49 L
కృష్ణ : 33 L
నెల్లూరు : 21 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ : 5.13 కోట్లు
KA + ROI - 76 L
OS - 97 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 6.86 కోట్లు (13.55 కోట్ల గ్రాస్)

Latest News
 
అజర్‌బైజాన్‌ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'విదా ముయార్చి' టీమ్ Mon, Jul 22, 2024, 07:50 PM
'మెకానిక్ రాకీ' ఇండియా వైడ్ థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Jul 22, 2024, 07:47 PM
'కన్నప్ప' నుండి స్పెషల్ పోస్టర్ అవుట్ Mon, Jul 22, 2024, 07:24 PM
'మిస్టర్ బచ్చన్' సీడెడ్ రైట్స్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Jul 22, 2024, 07:22 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌ లో సత్య దేవ్ కీలక పాత్ర Mon, Jul 22, 2024, 07:20 PM