OTTలో ప్రసారానికి అందుబాటులో ఈషా రెబ్బా మలయాళ తొలి చిత్రం

by సూర్య | Sat, Mar 25, 2023, 08:34 PM

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఈషా రెబ్బ గతేడాది 'ఒట్టు' సినిమాతో మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కుంచకో భోగన్ కథానాయకుడిగా నటించారు. ఒట్టు చిత్రాన్ని మలయాళం, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత మలయాళ వెర్షన్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుండగా, తమిళ వెర్షన్ ఆహా తమిళంలో అందుబాటులో ఉంది.

తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం యొక్క  తెలుగు వెర్షన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. ఫెల్లిని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమిళ నటుడు అరవింద్ స్వామి మరియు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. జిన్స్ భాస్కర్, అనీష్ గోపాల్, ఆడుకలం నరేన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. నటుడు ఆర్య, షాజీ నదేశన్‌తో కలిసి ఆగస్ట్ సినిమా మరియు షో పీపుల్ బ్యానర్‌లపై ఒట్టు చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
తేజ సజ్జను థ్రిల్ చేసిన ప్రముఖ బాలీవుడ్ స్టార్ Mon, Dec 02, 2024, 03:49 PM
'సంక్రాంతికి వస్తున్నం' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ ఖరారు Mon, Dec 02, 2024, 03:42 PM
నాగ చైతన్య - శోభితలకు లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన నాగార్జున Mon, Dec 02, 2024, 03:36 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విదాముయార్చి' టీజర్ Mon, Dec 02, 2024, 03:28 PM
'UI' నార్త్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Dec 02, 2024, 03:21 PM