మీటర్ : సెకండ్ సింగిల్ ప్రోమో విడుదల

by సూర్య | Sun, Mar 19, 2023, 05:59 PM

రమేష్ కదూరి దర్శకత్వంలో, యంగ్ హీరో హీరోయిన్లు కిరణ్ అబ్బవరం, అతుల్య రవి జంటగా నటిస్తున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ "మీటర్". ఇటీవలే టీజర్ విడుదల చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మీటర్ చిత్రబృందం ఆపై ఫస్ట్ సింగిల్ 'ఛమ్మక్ ఛమ్మక్ పోరి' ని విడుదల చేసింది. తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు మార్చి 21న మీటర్ సెకండ్ సింగిల్ 'ఓ బేబీ జారిపోమాకే' అనే లవ్ డ్యూయెట్ సాంగ్ విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఓ బేబీ జారిపోమాకే.. నన్నొదిలెళ్ళిపోమాకే ... అట్ట మడి కట్టుకుంటూనే దడి కట్టుకుంటావా చుట్టూర అందానికే.. అని సాగే ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి సాయి కార్తీక్ బాణీలనందించారు. చిరంజీవి, హేమలత నిర్మించారు. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


 

Latest News
 
ఆ సినిమా సీక్వెల్ వారిద్దరూ చేస్తే బాగుంటుంది Sat, Apr 13, 2024, 10:09 PM
'జితేందర్ రెడ్డి' నుండి పాట విడుదల Sat, Apr 13, 2024, 10:08 PM
రామ్‌చరణ్‌ కి డాక్టరేట్‌ Sat, Apr 13, 2024, 10:06 PM
లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో మంచి మెసేజ్‌ ఉంటుంది Sat, Apr 13, 2024, 10:06 PM
మంచి అవకాశాలు వచ్చాయి కాబట్టే, ఈ స్థాయిలోకి వచ్చాను Sat, Apr 13, 2024, 10:04 PM