'ఎదుట నిలిచింది చూడు' సాంగ్ లిరిక్స్

by సూర్య | Sat, Mar 18, 2023, 10:25 AM

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరిచిపోయా మాయలో
ప్రాణమంతా మీటుతుంటే వానవీణలా

నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ

అవునో .. కాదో .. అడగకుంది నా మౌనం
చెలివో .. శిలవో .. తెలియకుంది నీ రూపం

చెలిమి బంధమల్లుకుందే .. జన్మ ఖైదులా

ఎదుట నిలిచింది చూడు

నిన్నే చేరుకోలేకా ఎటెళ్ళిందో నా లేఖ
వినేవారు లేకా విసుక్కుంది నా కేకా

నీదో .. కాదో .. వ్రాసున్న చిరునామా
ఉందో .. లేదో .. ఆ చోట నా ప్రేమా

వరం లాంటి శాపమేదో సొంతమైందిలా

ఎదుట నిలిచింది చూడు
జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరిచిపోయా మాయలో

ప్రాణమంతా మీటుతుంటే వానవీణలా
ఎదుట నిలిచింది చూడు

Latest News
 
'మేమ్ ఫేమస్' 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Jun 07, 2023, 03:02 PM
'రామబాణం' డే వైస్ AP/TS కలెక్షన్స్ Wed, Jun 07, 2023, 02:59 PM
'విరూపాక్ష' 41వ రోజు AP/TS కలెక్షన్స్ Wed, Jun 07, 2023, 02:55 PM
'ఉగ్రం' AP/TS టోటల్ కలెక్షన్ రిపోర్ట్ Wed, Jun 07, 2023, 02:51 PM
'కస్టడీ' డే వైస్ AP/TS కలెక్షన్స్ Wed, Jun 07, 2023, 02:40 PM