by సూర్య | Sun, Feb 05, 2023, 06:54 PM
పవర్ స్టార్ పవన్ కళ్యణ్, నటసింహం నందమూరి బాలకృష గార్ల మధ్య జరిగిన క్రేజీ చిట్ ఛాట్ చూసిన ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. అన్స్టాపబుల్ లో పవర్ఫుల్ ఫినాలే ఎపిసోడ్ గా స్ట్రీమింగ్ కి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే కదా. మొదటి భాగం స్ట్రీమింగ్ కి వచ్చి, ఆహా రికార్డులను తిరగ రాస్తుండగా, తాజాగా రెండవ భాగం యొక్క ప్రోమోను ఆహా కాసేపటి క్రితమే విడుదల చేసింది.
బాలయ్య సూటి ప్రశ్నలకు, పవన్ తూటాల్లాంటి సమాధానాలివ్వడంతో పార్ట్ 2 కి మరింత సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుందని తెలుస్తుంది. పోతే, పవర్ స్టార్మ్ రెండవ భాగం ఫిబ్రవరి 10వ తేదీన స్ట్రీమింగ్ కి రానుంది.
Latest News