by సూర్య | Sun, Feb 05, 2023, 06:34 PM
శుక్రవారం విడుదలైన "రైటర్ పద్మభూషణ్" చిత్రానికి ఆడియన్స్, క్రిటిక్స్ నుండి యూనానిమస్ గా సూపర్ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఆడియన్స్ డిమాండ్ మేరకు వరల్డ్ వైడ్ గా రైటర్ పద్మభూషణ్ షోలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద రైటర్ బాగానే కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా రైటర్ పద్మభూషణ్ తొలి రోజు 1. 54 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టుగా తెలిపిన మేకర్స్ రెండో రోజులలో 3.6కోట్లను వసూలు చేసిందని అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు.
సుహాస్, టీనా శిల్పారాజ్ జంటగా నటించిన ఈ సినిమాను షణ్ముఖ ప్రశాంత్ డైరెక్ట్ చేసారు. లహరి ఫిలిమ్స్, చాయ్ బిస్కట్ ఫిలిమ్స్ సంయుక్త బ్యానర్ లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ నిర్మించారు. ఆశిష్ విద్యార్ధి, రోహిణి కీలకపాత్రల్లో నటించారు.
Latest News