![]() |
![]() |
by సూర్య | Thu, Feb 02, 2023, 09:00 PM
భలే మంచి రోజు ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించడానికి బోర్డులోకి వచ్చినట్లు సమాచారం.
ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటించే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.