రా, రస్టిక్ ఫెరోషియస్ 'దసరా' టీజర్ రిలీజ్..!!

by సూర్య | Mon, Jan 30, 2023, 04:51 PM

మోస్ట్ అవైటెడ్ దసరా టీజర్ కాసేపటి క్రితమే విడుదలైంది. ఊరమాస్ అవతార్ లో, నాటురకం డైలాగులు చెప్తూ, శత్రువులపైకి ఉవ్వెత్తున లెగిసిన కెరటంలా నాని పెర్ఫార్మన్స్ కు ఆడియన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. ఇంత మాస్ అండ్ రగ్డ్ లుక్ లో నానిని ఇదివరకెన్నడూ కనిపించకపోవడంతో, దసరా టీజర్ కు మరింత ప్రత్యేకత చేకూరింది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల టేకింగ్ సూపర్బ్. ఇక, సంతోష్ నారాయణ్ అందించిన BGM గూజ్ బంపింగ్ అన్నమాట. మొత్తానికి ఇన్నాళ్లు ఎదురుచూసినందుకు దసరా టీజర్ అభిమానులకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇక, ఫుల్ సినిమా కోసం అంతా వెయిటింగ్..


కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సాయి కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.  

Latest News
 
'ఉషా పరిణయం' సెట్స్ లో స్టార్ డైరెక్టర్ Tue, Apr 30, 2024, 03:44 PM
'కృష్ణమ్మ' కోసం స్టార్ డైరెక్టర్స్ Tue, Apr 30, 2024, 03:40 PM
పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' టీజర్ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే..? Tue, Apr 30, 2024, 03:37 PM
'RC16' గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Apr 30, 2024, 03:35 PM
'పుష్ప 2' నార్త్ అమెరికా రైట్స్ పై లేటెస్ట్ బజ్ Tue, Apr 30, 2024, 03:31 PM