ధమాకా : రవితేజను వదలని రీ షూట్ల బెడద ..!!

by సూర్య | Thu, Nov 24, 2022, 07:32 PM

మాస్ రాజా రవితేజ ఒకేసారి నాలుగైదు మూవీ షూటింగ్స్ లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. టైగర్ నాగేశ్వర రావు, రావణాసుర, ఈగల్, ధమాకా మూవీ షూటింగ్స్ లో రవితేజ సైమల్టేనియస్ గా పాల్గొంటున్నారు. వీటిల్లో నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో యాక్షన్ కామెడీ చిత్రంగా రూపొందుతున్న ధమాకా ఆల్మోస్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. వచ్చే నెల 23న విడుదలకు సిద్ధమవుతోంది.


ఈ నేపథ్యంలో ధమాకా సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ మీడియాలో వినిపిస్తుంది. అదేంటంటే, ధమాకా మూవీ రఫ్ కట్ చూసిన రవితేజ కొన్ని ఎపిసోడ్స్ తో సంతృప్తి చెందలేదట. మరొక కొత్త రైటర్ తో  ఈ ఎపిసోడ్లను తిరిగి రాయించి, వాటిని రీషూట్ చేసారంట. ఫైనల్ కట్ తో రవితేజ సాటిస్ఫై అయ్యారంట.


రవితేజ గతచిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ' కూడా ఇలానే కొన్ని ఎపిసోడ్లను రీషూట్ జరుపుకుంది. ఈ విషయంలో రెండు సినిమాలకు పోలిక ఉన్నా, ఫలితం విషయంలో మాత్రం ఫుల్ వేరియేషన్ ఉంటే అంతే చాలు.

Latest News
 
పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. ట్వీట్ వైరల్ !! Fri, Dec 02, 2022, 11:01 PM
USA లో అదరగొట్టేస్తున్న "హిట్ 2"..!! Fri, Dec 02, 2022, 10:32 PM
సమంత "యశోద" డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్ Fri, Dec 02, 2022, 10:26 PM
రేపు రాబోతున్న "గుర్తుందా శీతాకాలం" రిలీజ్ ట్రైలర్ ..!! Fri, Dec 02, 2022, 10:20 PM
'యశోద' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Dec 02, 2022, 09:02 PM