తెలుగులో మరొక క్రేజీ ప్రాజెక్ట్ చెయ్యనున్న ధనుష్..!!

by సూర్య | Thu, Nov 24, 2022, 07:35 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు తెలుగులో కూడా చాలా మంచి ఫాలోయింగే ఉంది. ఇన్నాళ్లు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ధనుష్ 'సార్' సినిమాతో డైరెక్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది.


తాజా సమాచారం ప్రకారం, ధనుష్ మరొక తెలుగు సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. నీది నాది ఒకే కథ, విరాటపర్వం వంటి డిఫరెంట్ జానర్ మూవీస్ ను తెరకెక్కించి విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ వేణు ఉడుగుల ఈ మధ్యనే ధనుష్ ను కలిసి ఒక స్టోరీని వినిపించారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఈ ఇద్దరి కాంబోలో ఒక విభిన్నమైన సినిమాను మనం ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు.

Latest News
 
పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. ట్వీట్ వైరల్ !! Fri, Dec 02, 2022, 11:01 PM
USA లో అదరగొట్టేస్తున్న "హిట్ 2"..!! Fri, Dec 02, 2022, 10:32 PM
సమంత "యశోద" డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్ Fri, Dec 02, 2022, 10:26 PM
రేపు రాబోతున్న "గుర్తుందా శీతాకాలం" రిలీజ్ ట్రైలర్ ..!! Fri, Dec 02, 2022, 10:20 PM
'యశోద' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Dec 02, 2022, 09:02 PM