'RC15' తదుపరి షెడ్యూల్ గురించిన ఆసక్తికరమైన అప్డేట్

by సూర్య | Thu, Nov 24, 2022, 06:25 PM

సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'RC15' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఖరీదైన ఒక పాట చిత్రీకరణ కోసమే న్యూజిలాండ్‌లో ఉన్న టీమ్ డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌కు తిరిగి రానుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ని డిసెంబర్ చివరి వారంలో ప్రారంభించనున్నారు. వైజాగ్, కర్నూలు, రాజమండ్రిలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు అని సమాచారం.


ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ  కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య , సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మెగా చిత్రానికి థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్న అల్లు అర్జున్ Tue, Jan 14, 2025, 08:37 PM
'వీర ధీర శూరన్‌' ఫస్ట్ సింగల్ కి భారీ స్పందన Tue, Jan 14, 2025, 06:11 PM
'లైలా' నుండి విశ్వక్ సేన్ ఫిమేల్ లుక్ రివీల్ Tue, Jan 14, 2025, 06:06 PM
లెహంగాలో తమన్నా స్టన్స్ Tue, Jan 14, 2025, 06:00 PM
దర్శకుడు త్రినాధరావుకి సపోర్ట్‌గా వచ్చిన హీరోయిన్ Tue, Jan 14, 2025, 05:56 PM