![]() |
![]() |
by సూర్య | Thu, Sep 29, 2022, 04:44 PM
నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రం "ది ఘోస్ట్" మూవీ నుండి ఇటీవలే ట్రైలర్ విడుదలై సినిమాపై భారీ అంచనాలను నమోదు చేసిన విషయం తెలిసిందే కదా.
లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసారు. రేపు సాయంత్రం 04:05గంటలకు ది ఘోస్ట్ రిలీజ్ ట్రైలర్ విడుదల కాబోతుందని స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు.
మొదటి ట్రైలర్లో ఊరమాస్ యాక్షన్ సీక్వెన్సెస్ తో అభిమానులను అలరించిన నాగ్ ఈసారి ఎలాంటి కంటెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చెయ్యబోతున్నాడో చూడాలి.
పోతే ఈ సినిమాలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రవీణ్ సత్తారు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. భరత్ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ ఐదవ తేదీన మూవీ థియేటర్లలో విడుదల కాబోతుంది.