'ఓరి దేవుడా' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌

by సూర్య | Wed, Sep 28, 2022, 08:52 PM

తమిళ రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచినా "ఓ మై కడవులే" సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తెలుగులో ఈ సినిమాకి "ఓరి దేవుడా" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ఫిక్స్ చేసారు. మాస్ కా దాస్, విశ్వక్ సేన్ సరసన బాలీవుడ్ బబ్లీ బ్యూటీ మిథిలా పాల్కర్ ఈ సినిమాలో నటిస్తోంది. తమిళ్ లో ఈ సినిమాని డైరెక్ట్ చేసిన అశ్వత్ మరిముత్తు తెలుగులో కూడా డైరెక్ట్ చేయనున్నారు.


ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం, అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఫాంటసీ సినిమాలో విక్టరీ వెంకటేష్ అతిధి పాత్రలో నటించనున్నారు. ఒరిజినల్‌లో విజయ్ సేతుపతి పోషించిన దేవుడి పాత్రలో వెంకటేష్ నటించనున్నాడని సమాచారం. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
సిట్టింగ్ ఫోజులతో రీతూ వర్మ కిర్రాక్ ఫోజులు Sun, Sep 24, 2023, 12:00 PM
అందాలతో చంపేస్తున్నదిశా పటానీ Sun, Sep 24, 2023, 11:49 AM
'క‌న్న‌ప్ప‌'లో ప్రభాస్‌కు జోడీగా న‌య‌న‌తార‌ Sun, Sep 24, 2023, 10:57 AM
విడుదల తేదీని ఖరారు చేసిన 'ధృవ నచ్చతిరమ్' Sat, Sep 23, 2023, 08:57 PM
గోపీచంద్-శ్రీను వైట్ల సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ Sat, Sep 23, 2023, 08:47 PM