కంగనారనౌత్ "ఎమర్జెన్సీ" నుండి కీలక ప్రకటన

by సూర్య | Wed, Sep 28, 2022, 08:50 PM

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్న సరికొత్త చిత్రం "ఎమర్జెన్సీ". ఇందులో కంగనా ఫార్మర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ రోల్ లో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, అటల్ బిహారి వాజ్పేయ్ పాత్రలో శ్రేయాస్ తాల్పడే,  పుపుల్ జయకర్ పాత్రలో సీనియర్ బాలీవుడ్ నటి మహిమా చౌదరి నటిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీలో మరో కీలకపాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. జగ్జీవన్ రామ్ పాత్రలో ట్యాలెంటెడ్ యాక్టర్ సతీష్ కౌశిక్ నటిస్తున్నట్టు పేర్కొంటూ, ఆయన క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేసారు.
ఇండియన్ పాలిటిక్స్ లో ఒక మచ్చు తునకలా మిగిలిపోయే ఎమర్జెన్సీ సమయం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కంగనా డైరెక్ట్ చేస్తుంది. మణికర్ణికా ఫిలిమ్స్ బ్యానర్ పై కంగనా రనౌత్, రేణు పిట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2023లో విడుదలవుతుంది.

Latest News
 
'లియో' మూవీ రెండవ సింగిల్ రిలీజ్ Thu, Sep 28, 2023, 09:29 PM
స్టార్ హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు Thu, Sep 28, 2023, 09:15 PM
హీరో సిద్ధార్థ్‌కు కర్ణాటకలో చేదు అనుభవం Thu, Sep 28, 2023, 09:06 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' Thu, Sep 28, 2023, 08:58 PM
రేపు డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'ఏజెంట్' Thu, Sep 28, 2023, 08:56 PM