'ఓరి దేవుడా' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌

by సూర్య | Wed, Sep 28, 2022, 08:52 PM

తమిళ రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచినా "ఓ మై కడవులే" సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తెలుగులో ఈ సినిమాకి "ఓరి దేవుడా" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ఫిక్స్ చేసారు. మాస్ కా దాస్, విశ్వక్ సేన్ సరసన బాలీవుడ్ బబ్లీ బ్యూటీ మిథిలా పాల్కర్ ఈ సినిమాలో నటిస్తోంది. తమిళ్ లో ఈ సినిమాని డైరెక్ట్ చేసిన అశ్వత్ మరిముత్తు తెలుగులో కూడా డైరెక్ట్ చేయనున్నారు.


ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం, అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఫాంటసీ సినిమాలో విక్టరీ వెంకటేష్ అతిధి పాత్రలో నటించనున్నారు. ఒరిజినల్‌లో విజయ్ సేతుపతి పోషించిన దేవుడి పాత్రలో వెంకటేష్ నటించనున్నాడని సమాచారం. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
పింక్ చీరకట్టులో మరింత అందంగా కీర్తి Fri, Oct 11, 2024, 10:35 AM
OTTలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ Fri, Oct 11, 2024, 10:22 AM
బాడీకాన్ డ్రెస్ లో సోనియా బన్సాల్ Thu, Oct 10, 2024, 08:46 PM
కృతి శెట్టి గ్లామర్ షో ! Thu, Oct 10, 2024, 08:35 PM
భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలిపిన గొప్ప లెజెండరీ ఐకాన్‌ రతన్‌ టాటా : రజినీకాంత్‌ Thu, Oct 10, 2024, 08:28 PM