ఐమాక్స్‌లో విడుదలయే తొలి తమిళ చిత్రంగా మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్'

by సూర్య | Wed, Aug 17, 2022, 04:58 PM

కోలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' ప్రాజెక్ట్‌ ఒకటి. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా  రెండు భాగాలుగా రూపొందుతోంది అని సమాచారం. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి, శోభిత దూళిపాళ, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, పొన్నియిన్ సెల్వన్ సినిమా IMAX ఫార్మాట్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. తమిళ సినిమా చరిత్రలో అలా చేసిన మొదటి చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఈ ఫార్మెట్‌లో సినిమా ఎలా ఉంటుందనేది ఇప్పుడు సినీప్రేమికులకు ఆసక్తికరంగా మారింది. కొన్ని రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ని అందిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM