ముంబైలో రష్మిక... ఏం చేస్తుందో తెలుసా?

by సూర్య | Sat, Aug 06, 2022, 03:10 PM

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా, నేషనల్ క్రష్ గా ఎదిగి బాలీవుడ్ సినిమాల్లో క్రేజీ ఆఫర్లను కొట్టేసిన కన్నడ బ్యూటీ రష్మిక మండన్నా. పుష్ప తో ఆమె క్రేజ్ నేషనల్ లెవెల్ కి చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె పలు టాప్ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, రష్మికమండన్నా ప్రస్తుతం ముంబైలో ఉంది. అక్కడ తనకున్న వర్క్ కమిట్మెంట్స్ ను పూర్తి చేసే పనిలో చాలా బిజీగా ఉంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కుతున్న "యానిమల్"లో రణ్ బీర్ కపూర్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ మరియు, ఇదివరకే షూటింగ్ పూర్తి చేసుకున్న "గుడ్ బై" మూవీలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు గానూ రష్మిక ముంబైలో ఉందట. ఇంకా రష్మిక విజయ్ "వారసుడు", సిద్దార్ధ్ మల్హోత్రా "మిషన్ మజ్ను" చిత్రాలలో నటిస్తుంది. రష్మిక ఖాతాలో పుష్ప సీక్వెల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇది పట్టాలెక్కడానికి ఇంకా చాలా టైం ఉందనుకోండి.

Latest News
 
రేపు థియేటర్లో సందడి చేయనున్న 'హిట్ 2' మూవీ Thu, Dec 01, 2022, 11:30 PM
'యశోద' 17 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Thu, Dec 01, 2022, 09:03 PM
రేపు థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Thu, Dec 01, 2022, 09:01 PM
'హిట్2' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ Thu, Dec 01, 2022, 08:56 PM
ఒక్కరోజు గ్యాప్ తో బాక్సాఫీస్ దండయాత్రకు రాబోతున్న సీనియర్ హీరోలు..!! Thu, Dec 01, 2022, 08:40 PM