నితిన్ "MNV" హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్

by సూర్య | Sat, Aug 06, 2022, 03:13 PM

ఎడిటర్ నుండి డైరెక్టర్ గా మారిన MS రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న తొలి చిత్రం "మాచర్ల నియోజకవర్గం". యంగ్ హీరో నితిన్, కృతిశెట్టి జంటగా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కాబోతుంది.
లేటెస్ట్ గా మేకర్స్ హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ఆగస్టు 7వ తేదీ సాయంత్రం ఆరింటి నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని తెలుపుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. కానీ, ఈ ఈవెంట్ ఎక్కడ జరగబోతుందనేది మేకర్స్ రివీల్ చెయ్యలేదు.
శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.

Latest News
 
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM
హాలివుడ్ కంటే దక్షిణాది చిత్రాలను చేయాలి అనుకొంటున్నా: సల్మాన్ ఖాన్ Sun, Oct 02, 2022, 08:48 PM
కృతి శెట్టి మత్తెక్కించే పోజులు.! Sun, Oct 02, 2022, 02:44 PM