యూట్యూబులో ట్రెండ్ అవుతున్నఫేర్ వెల్ సాంగ్

by సూర్య | Wed, Jul 06, 2022, 01:39 PM

అక్కినేని నాగచైతన్య, రాశిఖన్నా జంటగా నటించిన "థాంక్యూ" మూవీ నుండి మూడవ లిరికల్ సాంగ్ గా రిలీజయిన "ఫేర్ వెల్" పాటకు యూట్యూబులో వీక్షణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఒక్కరికి తమ కాలేజీ రోజులను జ్ఞప్తికి తెస్తున్న ఈ పాటకు యూట్యూబులో ఇప్పటికి మూడు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఫేర్ వెల్స్ జీవితంలో రాబోయే మరో అరుదైన ఘట్టాలకు స్వాగతలాంటివి అని అర్ధం వచ్చే ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుంది. ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించగా, చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. తమన్ తన మెలోడీ పవర్ తో మరోసారి మ్యాజిక్ చేసాడు.
విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో నాగ చైతన్య, రాశిఖన్నా జంటగా నటించిన థాంక్యూ చిత్రం జూలై 22న విడుదల కాబోతుంది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.

Latest News
 
కమెడియన్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం Wed, Aug 17, 2022, 11:08 PM
'గాడ్‌ఫాదర్‌' మూవీ అప్డేట్ Wed, Aug 17, 2022, 10:53 PM
మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ Wed, Aug 17, 2022, 10:38 PM
రేపు థియేటర్లో సందడి చేయనున్న ధనుష్ 'తిరు' మూవీ Wed, Aug 17, 2022, 09:26 PM
'దొంగలున్నారు జాగ్రత్త' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 17, 2022, 09:11 PM