వారసుడిని షేర్ చేసుకుంటున్న దిల్ రాజు, పీవీపీ

by సూర్య | Thu, Jun 23, 2022, 06:22 PM

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లేటెస్ట్ గా కోలీవుడ్ హీరో విజయ్ తో సినిమా నిర్మిస్తున్నారనే విషయం తెలిసిందే కదా. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషలలో రూపొందుతుంది. ఈ సినిమాతో దిల్ రాజు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
తెలుగులో "వారసుడు" గా, తమిళంలో "వారసి" గా తెరకెక్కుతున్న ఈ మూవీకి దిల్ రాజునే నిర్మాత అని నిన్నటి వరకు అనుకున్నారంతా. విజయ్ పుట్టినరోజు సందర్భంగా నిన్న రిలీజ్ చేసిన మూడు పోస్టర్లలో, దిల్ రాజు ఓన్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తో పాటుగా పీవీపీ లోగోను వెయ్యడం ఆసక్తిగా మారింది. నిర్మాతలుగా శిరీష్, లక్ష్మణ్, పెర్ల్ వి పొట్లూరి, పరం వి పొట్లూరి పేర్లను పోస్టర్లలో వెయ్యడానికి కారణమేంటని ఆరా తీయగా, తెలిసిందేమిటంటే, ఆల్రెడీ డైరెక్టర్ వంశీ పీవీపీ సంస్థ నుండి అడ్వాన్స్ తీసుకున్నారని, వాటిని తిరిగివ్వకుండా వారసుడు సినిమాలో స్లీపింగ్ పార్టనర్ గా చేర్చారని కొంతమంది అంటున్నారు. ఈ విషయంపై, చిత్రబృందం ఎలాంటి అధికారిక సమాచారాన్ని ఇప్పటివరకు ఇవ్వలేదు.

Latest News
 
ప్రముఖ నటుడు కిషోర్ దాస్ కన్నుమూత Sun, Jul 03, 2022, 10:53 PM
లారెన్స్ 'రుద్రుడు' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Jul 03, 2022, 10:26 PM
సత్యదేవ్ 'కృష్ణమ్మ' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ Sun, Jul 03, 2022, 10:20 PM
ఓటిటిలో సందడి చేయనున్న `అంటే సుందరానికి` మూవీ Sun, Jul 03, 2022, 10:11 PM
నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీ అప్డేట్ Sun, Jul 03, 2022, 10:00 PM