"పక్కా కమర్షియల్" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్?

by సూర్య | Wed, Jun 22, 2022, 07:28 PM

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న కొత్త చిత్రం "పక్కా కమర్షియల్". సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్లో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ కు జోడిగా రాశీఖన్నా నటిస్తుంది. ఈ జంట జట్టు కట్టడం ఇది రెండోసారి. తొలుత జిల్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న పక్కా కమర్షియల్ సినిమాను ప్రఖ్యాత గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రీసెంట్గానే ట్రైలర్ రిలీజ్ అవ్వగా, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. డీసెంట్ అంచనాల నడుమ ఈ సినిమా జూలై 1వ తేదీన విడుదలవడానికి రెడీ అవుతోంది.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, పక్కా కమర్షియల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 25, 26 తేదీలలో జరగబోతుందట. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చెయ్యనున్నారట.

Latest News
 
అదిరిపోయే స్టిల్స్ రీతూ వర్మ ..ఫొటోస్ Tue, Jul 05, 2022, 12:51 PM
అనుపమ లేటెస్ట్ స్టిల్స్ Tue, Jul 05, 2022, 12:47 PM
నరేష్ వల్ల తీవ్రంగా నష్టపోయిన పవిత్ర లోకేష్ ..!! Tue, Jul 05, 2022, 12:44 PM
ఈ వారం అలరించనున్న సినిమాలివి Tue, Jul 05, 2022, 12:25 PM
అల్లుఅరవింద్ చేతికి లాల్ సింగ్ చద్దా తెలుగు రైట్స్ Tue, Jul 05, 2022, 12:24 PM