ఎనిమిది నెలల తర్వాత ఓటిటిలో పెళ్లి సందడి... ఆలస్యానికి కారణమేంటంటే

by సూర్య | Wed, Jun 22, 2022, 07:24 PM

గౌరి రోరంకి దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం "పెళ్లి సందడి". ఈ సినిమాకి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు దర్శకత్వ పర్యవేక్షణ చేయగా, మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా 1996లో హీరో శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. గతేడాది అక్టోబర్ లో రిలీజైన పెళ్లి సందడి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే రాబట్టింది. కానీ ఈ సినిమాకి బాడ్ రివ్యూలు, విమర్శలు తప్పలేదు.
తాజాగా పెళ్లి సందడి సినిమా డిజిటల్ లో సందడి చెయ్యడానికి రెడీ అయ్యింది. ప్రముఖ జీ 5 ఓటిటిలో ఈనెల 24వ తేదీ నుండి పెళ్లి 'సందడి' మొదలుకానుంది. బాక్సాఫీస్ వద్ద హిట్టైన సినిమాలు, ఫ్లాపైన సినిమాలు వారాల గ్యాప్ లోనే డిజిటల్ స్టీమింగ్ కు రెడీ అవుతుండగా, పెళ్ళిసందడి సినిమా మాత్రం ఎనిమిది నెలల లాంగ్ గ్యాప్ ను తీసుకోవడం వెనక గట్టి కారణం ఉందట. రిలీజ్ టైం లో మూవీ మేకర్స్ కు సదరు ఓటిటి సంస్థకు సరైన డీలింగ్ కుదరలేదంట. ఇటీవలే ఈ ఒప్పందం ఒక కొలిక్కి వచ్చిందట. దీంతో ఈ సినిమా డిజిటల్ ఎంట్రీకి ఇన్నాళ్లు పట్టింది.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM