హీరో సూర్య చేతులమీదుగా రిలీజ్ అవనున్న వారియర్ విజిల్ సాంగ్

by సూర్య | Wed, Jun 22, 2022, 04:50 PM

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని త్వరలోనే వెండితెరపై వారియర్ గా కనిపించి అలరించనున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ సరసన కృతిశెట్టి, అక్షర గౌడ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న ఈ మూవీని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో బుల్లెట్, దడ దడ అనే లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా సినిమా నుండి మూడో లిరికల్ పాటను రిలీజ్ చెయ్యడానికి ముహూర్తం సెట్ చేసారు. "విజిల్" అనే పేరుతో సాగే పాటను ఈరోజు సాయంత్రం ఏడు గంటల పన్నెండు నిమిషాలకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చేతులమీదుగా డిజిటల్ రిలీజ్ చెయ్యనున్నట్టు తెలుపుతూ మేకర్స్ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసారు. పోస్టర్ ను బట్టి చూస్తే, ఈ పాట మంచి పెప్పి నెంబర్ గా ఉండనుంది.
ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్గా, నదియా ముఖ్యపాత్రలో నటించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జూలై 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Latest News
 
పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృశోకం Tue, Jul 05, 2022, 11:40 AM
సూర్య సరసన పూజా హెగ్డే ? Tue, Jul 05, 2022, 11:40 AM
ఓటిటిలో అదరగొడుతున్న “మేజర్” చిత్రం.! Tue, Jul 05, 2022, 11:32 AM
RRR కాంట్రవర్సీ: "పుష్ప" నుండి రసూల్ ను తప్పించమని ఫ్యాన్స్ ట్వీట్లు Tue, Jul 05, 2022, 11:29 AM
సమంత హిందీ డిబట్ పై హీరోయిన్ తాప్సి అధికారిక ప్రకటన Tue, Jul 05, 2022, 10:56 AM