"వారసుడు" నుండి విజయ్ థర్డ్ లుక్ పోస్టర్ ఔట్ 

by సూర్య | Wed, Jun 22, 2022, 06:16 PM

టాలీవుడ్ డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ వంశీ పైడిపల్లి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మండన్నా హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో దిల్ రాజు కోలీవుడ్ నిర్మాణరంగంలోకి ప్రవేశిస్తున్నారు.
విజయ్ బర్త్ డే సందర్భంగా వారసుడు మూవీ నుండి విజయ్ లుక్ కు సంబంధించిన మూడు డిఫరెంట్ పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేసారు. నిన్న సాయంత్రం టైటిల్ ని రివీల్ చేస్తూ విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన మేకర్స్, ఈరోజు పొద్దున్న విజయ్ సెకండ్ లుక్ ను రిలీజ్ చేసారు. గతంలో వచ్చిన పుకార్ల ప్రకారమే తమిళంలో ఈ సినిమాకు "వారసి", తెలుగులో "వారసుడు" అనే టైటిల్స్ ను ఖరారు చెయ్యడం జరిగింది. నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ లో విజయ్ సూటు బూటు ధరించి, మంచి క్లాస్ లుక్ లో సూపర్ హ్యాండ్సమ్ గా ఉంటే, పొద్దున్న రిలీజ్ చేసిన సెకండ్ పోస్టర్ లో క్యాజువల్ వేర్ లో చిన్న పిల్లలతో కలిసి ఎంటర్టైన్ అవుతున్నట్టు కనిపిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన మూడో పోస్టర్ లో విజయ్ ఒక బైక్ మీద కూర్చుని ఉంటాడు. విజయ్ ఇంటెన్స్ లుక్ పక్కా మాస్ గా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి వారసుడు హంగామా చెయ్యనున్నాడు.

Latest News
 
నరేష్ వల్ల తీవ్రంగా నష్టపోయిన పవిత్ర లోకేష్ ..!! Tue, Jul 05, 2022, 12:44 PM
ఈ వారం అలరించనున్న సినిమాలివి Tue, Jul 05, 2022, 12:25 PM
అల్లుఅరవింద్ చేతికి లాల్ సింగ్ చద్దా తెలుగు రైట్స్ Tue, Jul 05, 2022, 12:24 PM
కొత్త సినిమాను ప్రకటించిన సుమంత్ Tue, Jul 05, 2022, 12:20 PM
విజయ్ సినిమాలో రష్మిక స్పెషల్ సాంగ్? Tue, Jul 05, 2022, 12:19 PM