ఎన్టీఆర్ 30 ఆలస్యానికి కారణం కొరటాలా...?

by సూర్య | Wed, Jun 22, 2022, 04:35 PM

ఆర్ ఆర్ ఆర్ తో తొలి పాన్ ఇండియా సక్సెస్ ను అందుకున్న జూనియర్ ఎన్టీఆర్, ఆచార్యతో కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్న కొరటాల శివ కాంబోలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే కదా. సక్సెస్ ట్రాక్ ను కొనసాగించాలని తారక్, తనపై వచ్చిన అపవాదులను తొలగించుకుని తిరిగి హిట్టు కొట్టాలని కొరటాల ఈ సినిమాపై వేల ఆశలు పెట్టుకున్నారు. తారక్ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన మోషన్ పోస్టర్ తో అభిమానులు కూడా ఈ సినిమా పట్ల చాలా క్యూరియస్ గా ఉన్నారు. 
ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆలస్యమైంది. ఇందుకు ప్రధాన కారణంగా డైరెక్టర్ కొరటాల పేరే వినిపిస్తుంది. కొరటాలకున్న పర్సనల్ కమిట్మెంట్స్ వల్ల స్క్రిప్ట్ పనులు తద్వారా షూటింగ్ ఆలస్యమవుతుందట. వ్యక్తిగతంగా తనకున్న బాధ్యతలను త్వరగా పూర్తి చేసి కొరటాల వీలైనంత త్వరగా ఎన్టీఆర్ 30 సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. వన్స్, మూవీ సెట్స్ పైకి వెళ్లిందా.... ఎలాంటి అడ్డంకులొచ్చినా ఆగకుండా షూటింగ్ పూర్తి చెయ్యాలని నిర్ణయించుకున్నాడట.

Latest News
 
పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృశోకం Tue, Jul 05, 2022, 11:40 AM
సూర్య సరసన పూజా హెగ్డే ? Tue, Jul 05, 2022, 11:40 AM
ఓటిటిలో అదరగొడుతున్న “మేజర్” చిత్రం.! Tue, Jul 05, 2022, 11:32 AM
RRR కాంట్రవర్సీ: "పుష్ప" నుండి రసూల్ ను తప్పించమని ఫ్యాన్స్ ట్వీట్లు Tue, Jul 05, 2022, 11:29 AM
సమంత హిందీ డిబట్ పై హీరోయిన్ తాప్సి అధికారిక ప్రకటన Tue, Jul 05, 2022, 10:56 AM