బస్సు యాత్రకు ముందే వీరమల్లు షూటింగ్ పూర్తి?

by సూర్య | Wed, Jun 22, 2022, 04:39 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా "హరిహర వీరమల్లు". క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్టుతో నిర్మితమవుతున్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. పవన్ రాజకీయాల్లో బిజీగా మారడం, ఇతర కమిట్మెంట్స్ వల్ల ఈ మూవీ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. తాజాగా పవన్ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు జనసేన పార్టీని రూట్ లెవెల్ నుండి బలోపేతం చెయ్యటానికి ఇప్పుడు కన్నా మరింత ఎక్కువ సమయాన్ని రాజకీయాలకే కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పవన్ త్వరలోనే బస్సు యాత్రను కూడా ప్రారంభించబోతున్నాడు. ఈ బస్సు యాత్రకు ముందే, ఆల్రెడీ సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాడట. ఈ సమయాన్ని కేవలం వీరమల్లుకే కేటాయించి, మిగిలిన సినిమాల సంగతిని తర్వాత చూద్దామనే ఆలోచనలో ఉన్నాడని టాక్. ఈ విషయంపై మరింత క్లారిటీ రావలసిఉంది.

Latest News
 
పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృశోకం Tue, Jul 05, 2022, 11:40 AM
సూర్య సరసన పూజా హెగ్డే ? Tue, Jul 05, 2022, 11:40 AM
ఓటిటిలో అదరగొడుతున్న “మేజర్” చిత్రం.! Tue, Jul 05, 2022, 11:32 AM
RRR కాంట్రవర్సీ: "పుష్ప" నుండి రసూల్ ను తప్పించమని ఫ్యాన్స్ ట్వీట్లు Tue, Jul 05, 2022, 11:29 AM
సమంత హిందీ డిబట్ పై హీరోయిన్ తాప్సి అధికారిక ప్రకటన Tue, Jul 05, 2022, 10:56 AM