ది వారియర్ లోని 'విజిల్' పాటను నేడు విడుదల చేయనున్న కోలీవుడ్ స్టార్ హీరో

by సూర్య | Wed, Jun 22, 2022, 02:51 PM

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, లింగుస్వామి దర్శకత్వంలో  "వారియర్" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ డ్రామా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి అండ్ అక్షర గౌడ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. జులై 14, 2022న ఈ సినిమాని థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈరోజు ఈ సినిమాలోని 'విజిల్' అనే మాస్ సాంగ్‌ని విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. ఈరోజు సాయంత్రం 07:12 గంటలకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ పాటను డిజిటల్‌గా లాంచ్ చేయనున్నారు అని సమాచారం. మరోవైపు ఈ పాటను విడుదల చేసేందుకు మూవీ టీమ్ హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ఈవెంట్‌ను నిర్వహించనుంది. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Latest News
 
పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృశోకం Tue, Jul 05, 2022, 11:40 AM
సూర్య సరసన పూజా హెగ్డే ? Tue, Jul 05, 2022, 11:40 AM
ఓటిటిలో అదరగొడుతున్న “మేజర్” చిత్రం.! Tue, Jul 05, 2022, 11:32 AM
RRR కాంట్రవర్సీ: "పుష్ప" నుండి రసూల్ ను తప్పించమని ఫ్యాన్స్ ట్వీట్లు Tue, Jul 05, 2022, 11:29 AM
సమంత హిందీ డిబట్ పై హీరోయిన్ తాప్సి అధికారిక ప్రకటన Tue, Jul 05, 2022, 10:56 AM