రణ్ బీర్ కపూర్ "షంషేరా" టీజర్ రిలేజ్

by సూర్య | Wed, Jun 22, 2022, 02:49 PM

"బ్రహ్మాస్త్ర" తో పాన్ ఇండియా మార్కెట్ ను ఎదుర్కోనున్న రణ్ బీర్ కపూర్ అంతకన్నా ముందుగా "షంషేరా"తో తెలుగు, తమిళంలో తన మార్కెట్ ఎలా ఉందో తెలుసుకోబోతున్నాడు. కరణ్ మల్హోత్రా డైరెక్షన్లో రణ్ బీర్ కపూర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, వాణికపూర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కరోనా మరియు ఇతర కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతుండడంతో రిలీజ్ కూడా ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు జూలై 22న, హిందీ, తెలుగు, తమిళ భాషలలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై యాభైవ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మించారు.
ఇటీవలే ఈ మూవీ నుండి రణ్ బీర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవ్వగా, తాజాగా టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో రణ్ బీర్ కపూర్ ను వెనకనుండి, లాంగ్ షాట్స్ లో మాత్రమే చూపించారు. సంజయ్ దత్ పాలనలో విపరీత పరిస్థితులను ఎదుర్కొంటున్న తన జాతి ప్రజలను కాపాడేందుకు రణ్ బీర్ వస్తాడు. ఈ బరువైన పాత్రలో రణ్ బీర్ గెటప్, నటన అద్భుతంగా ఉన్నాయి. అమేజింగ్ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలను నమోదు చేసింది.

Latest News
 
తమన్నా వద్ద అరుదైన వజ్రం...! Tue, Jul 05, 2022, 01:07 PM
అదిరిపోయే స్టిల్స్ రీతూ వర్మ ..ఫొటోస్ Tue, Jul 05, 2022, 12:51 PM
అనుపమ లేటెస్ట్ స్టిల్స్ Tue, Jul 05, 2022, 12:47 PM
నరేష్ వల్ల తీవ్రంగా నష్టపోయిన పవిత్ర లోకేష్ ..!! Tue, Jul 05, 2022, 12:44 PM
ఈ వారం అలరించనున్న సినిమాలివి Tue, Jul 05, 2022, 12:25 PM