ప్రేమంటే ఇదేరా...లిప్ లాక్ తో ప్రేమను వ్యక్తించేసింది

by సూర్య | Sun, May 22, 2022, 07:15 PM

ప్రేమంటే ఇదేరా అన్నట్లుగా హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ త‌న‌కు సౌర‌భ్‌కు మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని ఓ ప్రత్యేక రీతిలో తెలియ‌జేసింది. అది కూడా ఏకంగా స్టేజ్‌పై వంద‌ల మంది ప్రేక్ష‌కులు చూస్తుండ‌గా.. ఓ ప్రముఖ ఛానెల్ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాయ‌ల్ రాజ్‌పుత్ స్పెష‌ల్ డాన్స్ చేసింది. అది కూడా త‌న ప్రియుడితో క‌లిసి.డాన్స్ ముగిసిన త‌ర్వాత సౌర‌భ్‌కి లిప్ లాక్ ఇచ్చి ఆడియెన్స్‌నే కాదు.. అత‌న్ని కూడా ఆశ్చ‌ర్య‌ప‌డేలా చేసింది పాయ‌ల్‌. మ‌రి ఈ అమ్మ‌డు పెళ్లి క‌బురు ఎప్పుడు చెబుతుందో చూడాలి.


చ‌న్నా మేరేయా అనే పంజాబీ చిత్రం.. వీరే కి వెడ్డింగ్ వంటి బాలీవుడ్ చిత్రం త‌ర్వాత తెలుగులోకి ఆర్ ఎక్స్ 100 చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్‌. తెలుగులో తొలి సినిమానే అయినా బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో యాక్ట్ చేసింది. హీరోతో లిప్ లాక్ చేయ‌డం.. గ్లామ‌ర్‌గా క‌నిపించడానికి వెనుకాడ‌క‌పోవ‌టం వంటి కార‌ణాల‌తో అమ్మ‌డుకి యూత్‌లో మంచి క్రేజ్ వ‌చ్చేసింది. దానికి తోడు ఆర్ ఎక్స్ 100 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌టం కూడా ఆమెకు క‌లిసొచ్చింది. అయితే స‌క్సెస్‌ను కంటిన్యూ చేయ‌టంలో పాయ‌ల్ త‌డ‌బ‌డింది. ఆర్‌డీఎక్స్ ల‌వ్ వంటి హీరోయిన్ సెంట్రిక్ మూవీలో న‌టించినా ... వెంక‌టేష్ జ‌త‌గా వెంకీ మామ‌లో.. ర‌వితేజ జోడీగా డిస్కోరాజాలో క‌నిపించినా సినిమాలు అమ్మ‌డుకి క‌లిసి రాలేదు. దాంతో అవ‌కాశాలు పెద్ద‌గా రాలేదు.


అదే స‌మ‌యంలో అమ్మ‌డు ఆహా ఓటీటీలోనూ న‌టించేసింది. అయితే ఓ ఆలోచ‌న చేసింది. ప్రియుడితో కలిసి హైద‌రాబాద్‌లో ఓ ఫ్లాట్ తీసుకుని అందులోనే మ‌కాం పెట్టేసింది. క్ర‌మంగా తెలుగులో అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌టంతో పాటు త‌మిళంపై కూడా దృష్టి పెట్టడంలో ఛాన్సులు వ‌స్తున్నాయి. ఇదంగా ప్రొఫెష‌న‌ల్‌గా పాయ‌ల్ కెరీర్ గ్రోత్‌.. అయితే ప‌ర్స‌న‌ల్ విష‌యంలో మాత్రం ఇప్ప‌టికే సౌర‌భ్ దింగ్రాతో ఈ ముద్దుగ‌మ్మ‌పీక‌ల లోతు ప్రేమ‌లో ఉంది. ఈ విష‌యాన్ని వారు ప‌లు సంద‌ర్భాల్లో ఫొటోలు, వీడియోల ద్వారా త‌మ రిలేష‌న్‌ను తెలియ‌జేస్తూనే వ‌చ్చారు.

Latest News
 
‘టిల్లూ క్యూబ్‌’లో పూజా హెగ్డే? Fri, May 03, 2024, 10:34 AM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM
పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్ Thu, May 02, 2024, 08:38 PM
'SSMB29' సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే ...! Thu, May 02, 2024, 08:36 PM