జీవితను మహానటిగా పేర్కొంటూ గరుడవేగ నిర్మాతల మండిపాటు

by సూర్య | Sun, May 22, 2022, 12:24 PM

టాలీవుడ్ సీనియర్ నటీనటులు రాజశేఖర్, జీవిత లపై కొన్ని రోజుల క్రితం చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. PSV గరుడవేగ నిర్మాత కోటేశ్వరరాజుకు రూ. 26 కోట్లు ఎగ్గొట్టిన కేసులో రాజశేఖర్, జీవిత లకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటును కూడా ఇష్యూ చేసింది. శేఖర్ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై జీవిత స్పందించారు. ఆమె మాట్లాడుతూ... PSV గరుడవేగా వివాదం కోర్టులో ఉందని, నిజానిజాలు తెలియకుండా ఎవరినీ నిందించొద్దని, కోర్టులో ఇంకా ఈ కేసు తేలకముందే మాపై మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. జీవిత చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా గరుడవేగ నిర్మాతలు స్పందించారు. సినిమాలలోనే కాదు, బయట కూడా జీవిత మహానటి అని ఎద్దేవా చేసారు. గరుడవేగ సినిమాకు సంబంధించి తాము ఒక్క రూపాయి కూడా పొందలేదని, తిరిగి ఇవ్వమని అడిగితే జీవిత బృందం చంపేస్తామని బెదిరించారని కోటేశ్వరరాజు పేర్కొన్నారు. కోర్టులో తమ విజయం నిశ్చయమని ఆయన తెలిపారు. దీనిపై జీవిత కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి. రాజశేఖర్ హీరోగా, జీవిత డైరెక్ట్ చేసిన శేఖర్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM