తండ్రైన నటుడు సుధాకర్ కోమాకుల

by సూర్య | Sun, May 22, 2022, 09:03 AM

టాలీవుడ్ హీరో సుధాకర్ కోమాకుల తండ్రయ్యాడు. సుధాకర్ కోమాకుల, హరిక సందెపోగు దంపతులకు పండంటి మగబిడ్డ జన్మంచడంతో ఆ కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. తనకు పండంటి బిడ్డ పుట్టిన విషయాన్ని స్వయంగా సుధాకర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఈనెల 14వ తేదీన బాబు జన్మించాడని, తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తన పోస్టులో తెలియజేశారు. తమ బాబుకు ‘రుద్ర కోమాకుల’ అని పేరు పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. పేరుతో పాటు తమ చిన్నారి ఫొటోను కూడా రివీల్ చేయడం విశేషం. సినీ ఇండస్ట్రీ స్నేహితులు, పెద్దలు సుధాకర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM