"మా అన్నయ్య" మూవీ నుంచి 'మైనా ఏమైనావే' సాంగ్ లిరిక్స్

by సూర్య | Sun, May 22, 2022, 09:08 AM

"మా అన్నయ్య" మూవీ నుంచి 'మైనా ఏమైనావే' సాంగ్ లిరిక్స్: 
మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
సాగు అల్లిక కొనసాగనీ ఇక
పూల మాలిక చెలి పూజకే ఇక

మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం

విరహాల నిట్టూర్పు విరజాజి ఓదార్పు
చలి గాలి సాయంత్రాల స్వాగతమే

పైపైకొచ్చే తాపాలు పైటమ్మిచ్చే శాపాలు
ఎదతోనే ముందుగా చేసే కాపురమే

ఎవరేమైనా.. ఎదురేమైనా... నేనేమైనా.. నీవేమైనా...
ఈ తోవుల్లో పువ్వై నిను పూజిస్తూ ఉన్నా

మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం

సందెపొద్దు నేరాలు అందమైన తీరాలు
దాటేస్తే కాదన్నానా ఎప్పుడైనా

కవ్విస్తున్న నీ కళ్ళు కైపెక్కించే పోకళ్ళు
కాటేస్తే కాదంటానా ఇపుడైనా

వయసేమైనా సొగసేమైనా మైమరిపించే మనసేమైనా
నవ్వు నవరాత్రి నీకోసం తీసుకు వస్తున్నా

మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం

తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
సాగు అల్లిక కొనసాగనీ ఇక
పూల మాలిక చెలి పూజకే ఇక

మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM