'NTR30' ఆఫర్ ని దీపికా పదుకొనె రిజెక్ట్ చేసిందా?

by సూర్య | Sat, May 21, 2022, 07:15 PM

కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఎన్టీఆర్ 30" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా మూవీ మేకర్స్ 'ఎన్టీఆర్ 30' మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ మోషన్ పోస్టర్ కి తారక్ అభిమానుల నుండి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. తాజా అప్డేట్ ప్రకారం, ఎన్టీఆర్ 30 మూవీ మేకర్స్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెకు హీరోయిన్ పాత్రను ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ కొన్ని కారణాల చేత ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది అని సమాచారం. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. 150 కోట్ల బడ్జెట్‌తో 'ఎన్టీఆర్ 30' సినిమాని తీస్తున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
'డార్లింగ్' లో తన భాగాన్ని పూర్తి చేసుకున్న నభా నటేష్ Tue, May 07, 2024, 04:31 PM
త్వరలో ఆహాలో మెరవనున్న 'విద్యా వాసుల అహం' Tue, May 07, 2024, 04:29 PM
'మైదాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Tue, May 07, 2024, 04:27 PM
'పుష్ప' నా కోసం ఏమీ చేసిందని నేను అనుకోను - ఫహద్ ఫాసిల్ Tue, May 07, 2024, 04:05 PM
బజ్ : ఆర్యన్ ఖాన్ యొక్క 'స్టార్‌డమ్' డిజిటల్ రంగప్రవేశం అప్పుడేనా Tue, May 07, 2024, 04:02 PM