ఫన్ వే లో సమాజానికి మెసేజ్ ఇచ్చే చిత్రం ఎఫ్ 3: దేవి శ్రీ ప్రసాద్

by సూర్య | Sat, May 21, 2022, 12:08 PM

టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, తన డైరెక్షన్లో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ 'ఎఫ్ 3' ని చేస్తున్నారన్న విషయం తెలిసిందే కదా. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లీడ్ రోల్స్ లో నటించిన మల్టీస్టారర్ గా ఎఫ్ 3 చిత్రం తెరకెక్కింది. ఇందులో వెంకటేష్ కు జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా, వరుణ్ కు జోడిగా మెహ్రీన్ నటించారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం మే 27న ప్రేక్షకులను పలకరించడానికి సిద్దపడింది. దీంతో గత కొద్దిరోజుల నుండి మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎఫ్ 3 మూవీలో టాలీవుడ్ హాస్య ప్రసిద్ధులైన జంధ్యాల,  ఈవీవీ సత్యనారాయణ ల మార్కు కామెడీ ఉంటుందని చెప్పారు. అనిల్ రావిపూడి ఎఫ్ 3 మూవీ స్క్రిప్ట్ ను చాలా గొప్పగా రచించారు, అంతకన్నా గొప్పగా తెరపైకి తీసుకొచ్చారని చెప్పారు. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు లేని, చాలా ఆరోగ్యకరనైన కామెడీతో ఒక మంచి మెసేజ్ ను ఎఫ్ 3 లో చూపించారని డీఎస్పీ పేర్కొన్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడితో పని చేస్తే అస్సలు టెన్షన్ అన్న మాట ఉండదని చెప్పారు. ఎఫ్ 2 తరహాలోనే ఎఫ్ 3లో కూడా సిట్యుయేషన్ కు తగ్గట్టు మంచి పాటలు కుదిరాయని, ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అవుతాయని దేవిశ్రీప్రసాద్ తెలిపారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM