'F3' ఓటిటి వివరాలను వెల్లడించిన దిల్ రాజు

by సూర్య | Fri, May 20, 2022, 02:44 PM

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న "ఎఫ్3" సినిమా మే 27, 2022న థియేటర్లలో రిలీజ్ కానుంది. తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం కోసం అందరు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ సినిమా OTT విడుదల గురించి వెల్లడించారు. ఈ సినిమా జులైలో OTT ప్లాట్ఫారంలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అని ఈ స్టార్ ప్రొడ్యూసర్ వెల్లడించారు. అంతేకాకుండా  'F3' సినిమా థియేట్రికల్ రన్ ఆధారంగా ప్లాన్ మారవచ్చు అని కూడా చెప్పారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంగీత, అంజలి ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM