అక్షయ్ కుమార్ 'పృథ్విరాజ్' నుండి రాయల్ హోలీ సాంగ్ టీజర్ ఔట్

by సూర్య | Thu, May 19, 2022, 09:16 PM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న చారిత్రక నేపధ్య చిత్రం పృథ్విరాజ్. ఈ చిత్రంలో 2017 ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సంజయ్ దత్, సోనూసూద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను ఎక్కడా రాజి పడకుండా చాలా గ్రాండ్ గా తెరకెక్కించింది. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషలలో జూన్ 3న విడుదల కానుంది. ఇటీవలనే ఈ మూవీ నుండి హరహర్ అనే లిరికల్ సాంగ్ విడుదలవగా, ప్రేక్షకుల నుండి మంచి అప్లాజ్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి మరో సాంగ్ టీజర్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ పూర్తి పాటను ధియేటర్లోనే చూపిస్తామని చిత్రబృందం పేర్కొంది. టీజర్ లో పృథ్విరాజ్, ఆయన ప్రేయసి రాణి సంయోగిత ల మధ్య ఉండే లవ్ ట్రాక్ ను, హోలీ నేపథ్యంలో కలర్ఫుల్ గా చూపించినట్టు తెలుస్తోంది. చూడటానికి రాయల్ లుక్ లో ఈ పాట ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకుంటుంది. బాలీవుడ్ హిస్టారికల్ బ్లాక్ బస్టర్స్ జోధా అక్బర్, పద్మావత్, బాజీరావ్ మస్తానీ, పానిపట్ తర్వాత తెరకెక్కుతున్న మరో బిగ్ బడ్జెట్ చిత్రం ఇదే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM