హిందీలో విడుదలైన కమల్ 'విక్రమ్' మూవీ ట్రైలర్

by సూర్య | Thu, May 19, 2022, 09:18 PM

ఖైదీ చిత్రంతో కోలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజన్, విశ్వనటుడు కమల్ హాసన్ తో తెరకెక్కిస్తున్న చిత్రం విక్రమ్. ఇందులో కోలీవుడ్, మాలీవుడ్ విలక్షణ నటులైన విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా సాగింది. కమల్ నట విశ్వరూపాన్ని, విలక్షణ నటుల వింతైన నటన తోడవడంతో ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. తాజాగా విక్రమ్ మూవీ ట్రైలర్ ను హిందీలో కూడా విడుదల చేసారు. విక్రమ్ హిట్లిస్ట్ పేరుతో విడుదలైన ఈ ట్రైలర్ కు బాలీవుడ్లో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి. పెన్ మూవీస్ వారు విక్రమ్ హిందీ డబ్బింగ్ హక్కులను కొనుక్కున్నారు. తన సొంత బ్యానర్లో భారీ బడ్జెట్ తో కమల్ నిర్మిస్తున్న ఈ సినిమాను జూన్ 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసారు.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM