'NBK #107' మూవీ అప్డేట్

by సూర్య | Tue, May 17, 2022, 11:49 PM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఒక చిత్రంలో నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. బాలయ్య సినీ కెరీర్లో ఇది 107వ సినిమా కావడంతో NBK #107 గా పిలుస్తున్నారు. గోపీచంద్ మలినేని, బాలయ్య గత చిత్రాలు క్రాక్, అఖండ రెండు బ్లాక్ బస్టర్లే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావటంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాలో బాలయ్యపై ఓ మాస్ పాటను చిత్రీకరించారు.ఈ పాటకి శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని, సంగీత దర్శకుడు తమన్, శేఖర్ మాస్టర్లతో బాలయ్య దిగిన ఫొటోను చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకున్నారు.

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM