ప్రారంభమైన సల్మాన్ ఖాన్-పూజాహెగ్డే సినిమా రెగ్యులర్ షూట్

by సూర్య | Sat, May 14, 2022, 02:32 PM

ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్‌ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సల్మాన్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజాహెడ్గే జంటగా కనిపించనుంది. 'కభీ ఈద్ కభీ దివాళీ' అనే టైటిల్ ని ఈ మూవీకి మేకర్స్ లాక్ చేసారు. ఆయుష్ శర్మ, జహీర్ ఇక్బాల్ సల్మాన్ సోదరులుగా నటిస్తుండగా, సాజిద్ నడియాడ్‌వాలా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా సిజ్లింగ్ బ్యూటీ పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో షూటింగ్ ప్రారంభమైనట్లు ప్రకటిస్తూ ఒక ఫోటోని పోస్ట్ చేసింది. ఈ గ్లామర్ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ బ్రాస్‌లెట్‌ను వేసుకున్న పిక్ ని పోస్ట్ చేసింది. ఈ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం ముంబైలోని విలే పార్లేలోని గోల్డెన్ టుబాకో ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM