మోస్ట్ ఎవైటెడ్ ర్యాప్ సాంగ్‌ను విడుదల చేసిన 'సర్కారు వారి పాట' టీమ్

by సూర్య | Sat, May 14, 2022, 01:36 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాకి అభిమానులు, సినిమాప్రేమికులు అండ్ సెలబ్రిటీల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలోని ర్యాప్ సాంగ్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదలైనప్పటి నుండి మహేష్ బాబు అభిమానులు మరియు సినిమాప్రేమికులు ఈ సాంగ్ కోసం చాల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూవీ మేకర్స్ ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేసారు. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
కమల్ హాసన్, అక్షయ్ కుమార్ సినిమాలపై 'మేజర్' షాకింగ్ కామెంట్స్ Thu, May 19, 2022, 09:12 PM
అవి తిరిగి పొందాలంటే 'శేఖర్' హిట్ అవ్వాల్సిందే - రాజశేఖర్ Thu, May 19, 2022, 09:09 PM
ఎన్టీఆర్ 30 మూవీ లుక్ రిలీజ్ Thu, May 19, 2022, 09:01 PM
పాన్ ఇండియా సినిమాలపై మరోసారి సిద్దార్ధ్ షాకింగ్ కామెంట్స్ Thu, May 19, 2022, 08:57 PM
'కాతువాకుల రెండు కాదల్' ఓవర్సీస్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Thu, May 19, 2022, 04:55 PM