విజయ్ సరసనా ఇద్దరా లేక ఒకరేనా

by సూర్య | Sat, May 14, 2022, 02:11 AM

హీరో విజయ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా విజయ్ తో దిల్ రాజు నిర్మించే చిత్రంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. తెలుగు .. తమిళ భాషల్లో రష్మికకి మంచి క్రేజ్ ఉంది. ఇక బాలీవుడ్ లోను చక్రం తిప్పే ఛాన్స్ కోసం అమ్మడు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ ఆమె అదృష్టం ఎలా ఉందనేది ఈ ఏడాది తెలిసిపోవచ్చు. 'పుష్ప'లో శ్రీవల్లి పాత్రలో మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ, 'పుష్ప 2' సినిమా కోసం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. 


ఇక తమిళంలో కార్తి జోడీగా ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి, తమిళ .. తెలుగు భాషల్లో రూపొందే ఒక సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అది కూడా విజయ్ సరసన. విజయ్ హీరోగా ఆయన 66వ సినిమా రూపొందనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. 


ఆ తరువాత సినిమాను ఆమె ప్రభాస్ సరసన చేయనున్నట్టుగా తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ 'స్పిరిట్' చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికల కోసం కియారాను .. రష్మికను సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. మరి ఇద్దరినీ తీసుకుంటారా? లేక ఎవరినైనా ఒకరినే ఎంపిక చేసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM