![]() |
![]() |
by సూర్య | Fri, May 13, 2022, 03:17 PM
సిరి హనుమంత్, రేష్మా పసుపులేటి బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకొన్నారు. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిం లతో సినీ కెరీర్ ను స్టార్ట్ చేసిన వీరిద్దరూ కలిసి బీఎఫ్ఎఫ్ అనే కొత్త వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు.
హిందీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న అడల్టింగ్ అనే వెబ్ సిరీస్‌ను తెలుగు ఓటిటి సంస్థ ఆహా బీఎఫ్ఎఫ్ గా రీమేక్ చేస్తున్నారు. హిందీలో అయేషా ఆహ్మద్, యశష్మిని దయానా, విరాజ్ గెహ్లానీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తెలుగులో సిరి హనుమంత్, రేష్మా పసుపులేటి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ప్రెస్ మీట్ జరిగింది. బీఎఫ్ఎఫ్ టీం మొత్తం కార్యక్రమంలో పాల్గొని సందడి చేసారు. ఈ సందర్భంగా ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ " నేటి యువతరానికి అద్దం పట్టే ఈ వెబ్ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది" అని తెలిపారు. స్వతంత్ర భావాలు కలిగిన ఇద్దరు యువతుల జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మే 20 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
Latest News