ప్రియాంక చోప్రా రెస్టారెంట్ లో విక్కీ,కత్రినాల డిన్నర్

by సూర్య | Fri, May 13, 2022, 03:09 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, స్టార్ హీరో విక్కీ కౌశల్ ను గతేడాది చివరిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గుట్టుచప్పుడు కాకుండా కొన్నాళ్ళు ప్రేమలో మునిగి తేలిన వీరిద్దరూ 2021లో రాజస్థాన్లోని పెద్ద కోటలో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సినిమాల నుండి కొద్దిగా బ్రేక్ తీసుకున్న ఈ జంట ప్రస్తుతం న్యూయార్క్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. న్యూయార్క్ లోని తన ఫెవరెట్ రెస్టారెంట్ లో విందు చేసిన కత్రినా, అందుకు సంబంధిన కొన్ని ఫోటోలను సోమవారం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. తాజాగా, న్యూయార్క్ లోని ప్రియాంక చోప్రా హోటల్ 'సోనా'లో డిన్నర్ చేసిన ఫోటోలను కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ బ్యూటీ. "ఇంటికి దూరంగా మరో ఇల్లు... ప్రియాంకా, నువ్వు ఏది చేసినా అద్భుతంగా ఉంటుంది" అని ప్రియాంక ను ట్యాగ్ చేస్తూ స్టోరీ షేర్ చేసింది. అందుకు ప్రియాంక ' సోనా లో డిన్నర్ చేసినందుకు కృతజ్ఞతలు. మా రెస్టారెంట్ మీకు ఆతిధ్యమివ్వటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉంటుంది. లవ్ యూ' అని కత్రినా పోస్ట్ ను రీపోస్ట్ చేసింది. సోనా న్యూయార్క్ కూడా తన అధికారిక ఇంస్టాగ్రామ్ పేజీలో విక్కీ, కత్రినాలు ఫోటోలను పోస్ట్ చేసి కృతజ్ఞతలు తెలిపింది.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM