స్టార్ హీరో సినిమా సెట్‏లో అగ్ని ప్రమాదం

by సూర్య | Sun, Jan 16, 2022, 09:02 AM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమా సెట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రస్తుతం బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, కృతి సనన్ జంటగా బ‌చ్‌ప‌న్ పాండే అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలో శనివారం ఈ సినిమా సెట్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. మంటలు అంటుకునే సమయంలో అక్షయ్, కృతి కూడా అక్కడే ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సిద్దార్థ, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దక్షిణాది చిత్రం జిగార్తాండకు రీమేక్ అన్న ప్రచారం నడుస్తోంది.

Latest News
 
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 'ప్రాజెక్ట్ Z' మూవీ Thu, May 09, 2024, 09:53 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'ఇంద్రాణి' Thu, May 09, 2024, 08:12 PM
OTT : చిత్రీకరణ ప్రారంభించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 Thu, May 09, 2024, 08:10 PM
రేపు రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న 'RRR' Thu, May 09, 2024, 07:41 PM
అనుపమ పరమేశ్వరన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Thu, May 09, 2024, 07:39 PM