గాడ్ ఫాదర్ లో యాంకర్ అనసూయ

by సూర్య | Mon, Jan 10, 2022, 01:08 PM

ఓ పక్క బుల్లితెర మీద తన అందాలతో అదరగొడుతూనే మరో పక్క సినిమాల్లో విలక్షణ పాత్రల్లో అదరగొడుతుంది యాంకర్ అనసూయ. తను చేయాలంటే స్మాల్ స్క్రీన్ ఇమేజ్ తో గ్లామర్ రోల్స్ చేయొచ్చు కానీ అనసూయ అలా కాకుండా వెండితెర మీద కొత్త ఇమేజ్ ప్రయత్నిస్తుంది.క్షణం నుండి పుష్ప సినిమా వరకు అనసూయ తన ప్రతి సినిమాలో తనని తాను కొత్తగా ప్రెజెంట్ చేయాలని ప్రయత్నిస్తుంది. పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్రలో అమ్మడు మరోసారి తన సత్తా చాటింది.


పుష్ప పార్ట్ 1లో తన పాత్ర చాలా తక్కువ ఉన్నా ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుందని.. అయితే పుష్ప పార్ట్ 2లో పాత్ర ఇంకాస్త పెద్దగా ఉంటుందని అంటుంది అనసూయ. ఇక ఇదే కాకుండా మరో మెగా ఛాన్స్ అందుకుంది అనసూయ. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కూడా అనసూయ నటిస్తుంది. మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో అనసూయ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్. సినిమాతో మరోసారి అనసూయ తన టాలెంట్ చూపిస్తుందని అంటున్నారు.


అయితే బుల్లితెర మీద తనకున్న హాట్ ఇమేజ్ ని సిల్వర్ స్క్రీన్ పై వాడుకోవాలని అనుకుంటున్న అనసూయ స్పెషల్ సాంగ్ ఆఫర్లని చేయాలని చూస్తుంది. అయితే ఓ పెద్ద సినిమాలో ఆఫర్ వస్తే ఆమె రెచ్చిపోవాలని అనుకుంటుంది. అటు స్మాల్ స్క్రీన్.. ఇటు బిగ్ స్క్రీన్ రెండిటితో అనసూయ చేస్తున్న రచ్చ మాములుగా లేదు. రెమ్యునరేషన్ లో కూడా ఓ చిన్నపాటి హీరోయిన్ రేంజ్ లో ఆమెకు ఇస్తున్నట్టు తెలుస్తుంది. యాంకర్ టూ బిజీ యాక్ట్రెస్ గా అనసూయ తన కెరియర్ ని సూపర్ గా ప్లాన్ చేసుకుంది. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే స్మాల్ స్క్రీన్ మాత్రం వదలట్లేదు అనసూయ.

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM