మరోసారి తెరపైకి మనోజ్‌ రెండో పెళ్లి

by సూర్య | Wed, Oct 27, 2021, 12:14 PM

విడాకుల అనంతరం సింగిల్‌గా ఉన్న నటుడు మంచు మనోజ్‌ త్వరలో మరోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ విదేశీ యువతిని ఆయన పెళ్లి చేసుకోనున్నారని.. అందుకు కుటుంబసభ్యులు సైతం పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయ్యారని గత కొన్నిరోజుల నుంచి వరుస కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై తాజాగా మంచు మనోజ్‌ షాక్‌కు గురయ్యారు. అవన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పేశారు. ''దయచేసి.. నన్ను కూడా పెళ్లికి పిలవండి. ఇంతకీ పెళ్లి ఎక్కడ చేస్తున్నారు? ఆ బుజ్జి, తెల్ల పిల్ల ఎవరు?! మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం!!'' అని మనోజ్‌ ట్వీట్‌ చేశారు. దీంతో మనోజ్‌ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని మరోసారి స్పష్టత వచ్చింది.


హైదరాబాద్‌కు చెందిన ప్రణతీరెడ్డితో 2015లో మనోజ్‌ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. వ్యక్తిగత జీవితంలో మనస్పర్థలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ 2019లో వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ఆనాటి నుంచి మనోజ్‌ రెండో పెళ్లి చేసుకోనున్నారంటూ ఎన్నో సార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక, సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ''అహం బ్రహ్మాస్మి' చిత్రంలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఇందులో మనోజ్‌ విభిన్నమైన గెటప్‌లో కనిపించనున్నారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM