బిగ్ బాస్ హౌస్ లో లాక్ డౌన్!

by సూర్య | Wed, Oct 27, 2021, 12:13 PM

ప్రతీ వారంలాగే ఈసారి బిగ్ బాస్ కొత్త కాన్సెప్ట్ తో కెప్టెన్సీ కంటెండ‌ర్ టాస్క్ ను ప్లాన్ చేశాడు. హౌస్ మొత్తం లాక్ డౌన్‌ చేశాడు. ఇంటి సభ్యులంతా గార్డెన్ ఏరియాలోనే ఉంటారని చెప్పాడు. ఇంటి స‌భ్యులు లోప‌లికి వెళ్లాలంటే కెప్టెన్సీ పోటీదారులు మొత్తం 5 ఛాలెంజ్‌ లు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. టాస్కులో గెలిచి కెప్టెన్సీ కంటెండర్ గా సెలక్ట్ అయిన సభ్యులు మాత్రమే ఇంట్లోకి వెళ్లాల్సి ఉంటుందని బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు. అయితే ఎవ‌రు పోటీప‌డ‌తారనేది ఏకాభిప్రాయంతో బిగ్ బాస్‌ కి తెల‌పాల్సి ఉండగా తొలి ఛాలెంజ్‌కి లోబో, ష‌ణ్ముఖ్ సిద్ధం అయ్యారు. తొలి టాస్క్‌లో పేడ కలిపిన మట్టిలో కొన్ని ముత్యాలను ఉంచారు. ఆ ముత్యాలను ఒక్కొక్కటిగా వెతికిపట్టాలని చెప్పారు. ఎవరు ఎక్కువ ముత్యాలను వెతికిపట్టుకుంటే వాళ్లే ఈ టాస్క్‌ లో విజేతలు అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. టాస్క్ కోసం లోబో, ష‌ణ్ముఖ్ తీవ్రంగా శ్ర‌మించారు. షన్నూ 101 ముత్యాలను ఏరి లోబో(74)పై విజయం సాధించాడు. తర్వాత టాస్కుల్లో సిరి, రవి స్విమ్మింగ్‌ ఫూల్‌ లో సీసాలు ఏరారు. మరోవైపు మానస్‌, శ్రీరామచంద్రలు చమటలు పట్టేలా తాళ్లను ఊపారు. సిరి, ర‌వి పూల్‌లో ఉన్న బాటిల్స్‌ని గాలం ద్వారా తీసి ఒడ్డున పెట్టే టాస్క్ లో పోటీపడ్డారు. బ‌జ‌ర్ మోగే లోపు సిరి 15 బాటిల్స్‌ని బయటకు తీసి రవి(12)పై విజయం సాధించింది. దీంతో సిరికి కూడా బిగ్ బాస్ హౌజ్ లో ప్ర‌వేశించే ఛాన్స్ ద‌క్కింది. మొద‌టి టాస్క్‌లో ష‌ణ్ముఖ్ విజయం సాధించి హౌజ్‌లోకి వెళ్ళాడు. షణ్ముఖ్, సిరి లోప‌ల‌కి వెళ్లి టీ తాగుకుంటూ చిల్ అయ్యారు. ఇక మూడో పోటీదారులుగా శ్రీరామ్, మానస్‌లు పోటీపడ్డారు. రోప్‌ని ఆపకుండా మూవ్ చేయాలని ఎవరైతే ఎక్కువ సేపు రోప్ చేస్తూ ఉంటారో వారే విజేత అవుతారని బిగ్ బాస్ తెలిపారు. టాస్క్‌లో శ్రీరామ్, మాన‌స్ బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. చివ‌రర‌కు శ్రీరామ్ విజేత‌గా నిలిచాడు. ఇక మరో రెండు టాస్క్‌లు మిగిలి ఉండగా.. ఆ రచ్చ నేడు కంటిన్యూ కానుంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM