రేపే 'గని' నుంచి ఫస్టు 'సింగల్ పంచ్'

by సూర్య | Tue, Oct 26, 2021, 07:47 PM

వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'గని' సినిమా రూపొందింది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమైంది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, డిసెంబర్ 3వ తేదీన విడుదల కానుంది.


తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. 'దే కాల్ హిమ్ గని .. కనివిని ఎరుగని' అంటూ సాగుతోంది. ఫస్టు సింగిల్ ను రేపు ఉదయం 11:08 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ కూడా బాక్సింగ్ నేపథ్యంలో సాగేదిగానే అనిపిస్తోంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ విదేశాల్లో శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే.


వరుణ్ తేజ్  సరసన నాయికగా సయీ మంజ్రేకర్ కనువిందు చేయనుంది. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నవీన్ చంద్ర కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ  సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో వరుణ్ తేజ్ ఉన్నాడు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM