క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్.. ఆర్యన్ ఖాన్‌కు మరోసారి మొండి చేయి

by సూర్య | Tue, Oct 26, 2021, 06:49 PM

ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు మరోసారి చుక్కెదురైంది. బెయిల్‌ పిటిషన్‌ను రేపటికి(బుధవారం) వాయిదా వేసింది ముంబై హైకోర్టు. బెయిల్ పిటిషన్ రేపు (బుధవారం, అక్టోబర్ 27) విచారణకు రానుంది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరగనుంది. ఆర్యన్, అర్బాజ్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. మరోసారి రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. అక్టోబర్ 20న జరిగిన విచారణలో ఎన్‌డిపిఎస్ చట్టం కింద బెయిల్‌ను ప్రత్యేక కోర్టు తిరస్కరించడంతో ఆర్యన్ ఖాన్ వెంటనే హైకోర్టును విచారణకు తరలించారు. మేజిస్ట్రేట్ కోర్ట్,సెషన్స్ కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన తర్వాత ఆర్యన్ ఖాన్ తరపు తరఫు వాదనలు వినిపించేందుకు భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఈరోజు హాజరయ్యారు.


బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆర్యన్‌ను ఎన్సీబీ అరెస్ట్‌ చేసిందని ఆయన తరపున వాదనలు విన్పించారు మాజీ అటార్నీ జనరల్ ముకుల్‌ రోహతగీ. క్రూయిజ్‌లో పార్టీకి గెస్ట్‌గా మాత్రమే ఆర్యన్‌ వెళ్లాడన్నారు. ప్రతీక్‌ గబ్బా ఆహ్వానం మేరకే క్రూయిజ్‌ పార్టీకి ఆర్యన్‌ వెళ్లినట్టు తెలిపారు.


ఆర్యన్‌ ఫ్రెండ్‌ ఆర్భాజ్‌ దగ్గర షూస్‌లో ఆరుగ్రాముల చరస్‌ దొరికిందన్నారు. ఆర్యన్‌ను అరెస్ట్‌ చేసి 23 రోజులయ్యిందని, ఇప్పటికి కూడా ఎన్సీబీ ఆయన దగ్గర ఎలాంటి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోలేకపోయిందన్నారు. గతంలో ఆర్యన్‌కు నేరచరిత్ర లేదన్నారు రోహతగీ.


క్రూయిజ్‌లో డ్రగ్స్‌ పార్టీపై ఎన్సీబీకి ముందే సమాచారముందన్నారు. కుట్రలో భాగంగానే అరెస్ట్‌ను అరెస్ట్‌ చేశారన్నారు. మెడికల్‌ టెస్ట్‌లో ఆర్యన్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్టు నిర్ధారణ కాలేదన్నారు. అసలు పార్టీ జరగలేదని , పార్టీకి ముందే అరెస్ట్‌ చేశారన్నారు.


ఆర్యన్‌ ఫోన్‌లో లభ్యమైన డ్రగ్స్‌ చాట్స్‌ ఆయన విదేశాల్లో ఉన్న సమయం లోనివని , ఈ కేసుతో సంబంధం లేదని వాదించారు ముకుల్‌ రోహతగీ. ఆర్యన్‌కు బెయిల్‌ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశముందని, విదేశాలకు పారిపోయే అవకాశముందని ఎన్సీబీ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసింది. షారూఖ్‌ మేనేజర్‌ పూజా దడ్లాని సాక్ష్యులను తమ వైపు తిప్పుకుంటున్నారని ఎన్సీబీ అఫిడవిట్‌లో పేర్కొంది. డ్రగ్స్‌ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్‌ సెయిల్‌ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఎన్సీబీ.


ఈ కేసులో మరింత లోతైన విచారణ అవసరమని , ఇంటర్నేషనల్‌ డ్రగ్‌ రాకెట్‌తో ఆర్యన్‌కు సంబంధాలు ఉన్నాయని కూడా అఫిడవిట్‌లో పేర్కొంది ఎన్సీబీ. అయితే ఎన్సీబీకి కౌంటర్‌గా హైకోర్టులో ఆర్యన్‌ కూడా అఫిడవిట్‌ దాఖలు చేశాడు. ఎన్సీబీలో జరుగుతున్న గొడవతో తనకు సంబంధం లేదని తెలిపాడు ఆర్యన్‌. సాక్షులతో తనకు ఎలాంటి సంబంధాలు కూడా లేవని తెలిపాడు. వాట్సాప్‌చాట్స్‌ను పరిగణ లోకి తీసుకోవద్దని కూడా అఫిడవిట్‌లో కోరాడు ఆర్యన్‌.


మరోవైపు క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్ లభించింది. ఈ బెయిల్ దరఖాస్తును ప్రత్యేక ఎన్‌డిపిఎస్ కోర్టు అనుమతించింది. అవిన్ సాహు, మనీష్‌లకు బెయిల్‌ దొరికింది.

Latest News
 
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM
'మనమే' టీజర్ కి భారీ స్పందన Sat, Apr 20, 2024, 07:10 PM
OTTలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ 'రణం' Sat, Apr 20, 2024, 07:08 PM