`పెళ్లి సందD ` 10 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాకే..!

by సూర్య | Tue, Oct 26, 2021, 11:42 AM

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా గౌరి రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `పెళ్లి సందడి `. ఈ చిత్రానికి కె.రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడమే కాదు.. ఓ కీలక పాత్ర కూడా పోషించారు. అయితే భారీ అంచనాల నడుమ అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌ను సొందం చేసుకుంది.


 కథలోనే కాదు, కథనం పరంగా కూడా ఎలాంటి కొత్తదనం కనిపించదు. రాఘవేంద్ర రావు - కీరవాణి మార్క్ పాటలు, చిత్రీకరణ తప్ప ఇందులో చెప్పుకోవాల్సిన విషయాలు ఏమీ ఉండవు. కానీ ఊహించని విధంగా ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. 10 రోజుల కలెక్షన్లను పరిశీలిస్తూ..


నైజాం- 1.88 కోట్లు


సీడెడ్- 1.38 కోట్లు


ఉత్తరాంధ్ర- 0.92 కోట్లు


ఈస్ట్- 0.46 కోట్లు


వెస్ట్- 0.37 కోట్లు


గుంటూరు- 0.58 కోట్లు


కృష్ణా- 0.41 కోట్లు


నెల్లూరు- 0.31 కోట్లు


ఏపీ + తెలంగాణ (టోటల్)- 6.32 కోట్లు


రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్- 0.36 కోట్లు


వరల్డ్ వైడ్ (టోటల్)- 6.68 కోట్లు


ఇక పెళ్లి సందడి ' చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.5.2 కోట్లు. అయితే మొదటివారానికే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ చిత్రం.. పది రోజులు చేరుకునే సరికి లాభాల బాట కూడా పట్టి అందరికీ మైండ్‌బ్లాక్ అయ్యేలా చేసింది. మొత్తానికి ఫ్లాప్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్లతో హిట్ అందుకున్నాడు రోషన్‌.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM